పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని MGNREGA పథకంలో పని చేసిన 30 లక్షల మందికి నిధులు చెల్లించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు.
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు దశల వారీగా నిధులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. MGNREGA పథకానికి బకాయి నిధుల విడుదలపై కేంద్రం ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా సీఎం మమతా ముందడుగు వేశారు.