వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు పార్టీ వీడనున్నట్లు ప్రకటించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆరగి శ్రీనివాసులు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.
చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకి పార్టీ అధిష్టానం అన్యాయం చేసిందని భావించి రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.