దేశంలో తొలిసారిగా డ్రైవర్ రహిత మెట్రో సేవలు బెంగళూరు నగరంలో అందుబాటులోకి రానున్నాయి. RVరోడ్డు- బొమ్మనహళ్లి వరకు 18.83 కిలోమీటర్ల ఎల్లో లైన్ (పసుపుపచ్చ మార్గం)లో ఇవి పరుగులు తీస్తాయి.
చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ వాహనాలను ప్రస్తుతం హెబ్బగూడిలోని మెట్రో డిపోలో ఆ దేశ ఇంజినీరింగ్ నిపుణులు పరీక్షిస్తున్నారు. పట్టాలపై ఆరుబోగీలతో యంత్రాన్ని జోడించి పరుగులకు సిద్ధం చేశారు.