తిరుమలలో ఫిబ్రవరి 24న పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో గరుడసేవ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa