పీలేరు మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా షేక్ ఇర్ఫాన్ నియమితులయ్యారు. జిల్లా డీసీసీ మైనార్టీ చైర్మన్ ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ నుంచి గురువారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరి, పదవి పొందానన్నారు. తనపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.