ఒంగోలులోని అగ్రహారం వద్ద జగనన్న లే అవుట్ లలో పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఈనెల 23న సీఎం జగన్ రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. సంబంధించిన అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం జగన్ రూట్ మ్యాప్ ను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.