జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్ సూచనల మేరకు బుధవారం రాత్రి పదవ డివిజన్ అధ్యక్షులు తెల్ల హరీష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా జనసైనికులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ మాట్లాడుతూ కాలనీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అకారణంగా పింఛన్లు తొలగించడం జరిగిందని ప్రజలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.