తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ చలో పేరిట రైతులు నిరసనకు తలపెట్టిన వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించి ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఈ నేపథ్యంలోనే చరిత్రాత్మక నిర్ణయం వెలువడింది. చెరకు కొనుగోలు ధర పెంపునకు ఆమోదం లభించింది. దీంతో కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది’ అని మోదీ పోస్టు పెట్టారు.