ఓ చిన్న కారణానికి భార్యాభర్తలు మార్గమధ్యలో గొడవపడిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. భర్తపై ఆగ్రహానికి గురైన భార్య అతడిని కింద పడేసి ఘోరంగా కొట్టింది.
అనంతరం భార్యపై కూడా భర్త దాడి చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దంపతులు ఇలా గొడవ పడుతుండడంతో ఇరుగుపొరుగు వారు వారిద్దరిని ఆపకుండావీడియోలు తీస్తూ నవ్వుతున్నారు. ఇప్పుడు ఈ జంట కొట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.