జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాయుడు సెటైర్లు వేశారు. 'పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు. పవన్ లాంటి అనైతికమైన రాజకీయవేత్త దేశంలోనే లేరు.
ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటి దాక ఓట్లు కొనకూడదని చేగువేరాలాగ కాకమ్మ కథలు చెప్పాడు. ఓట్లు కొనుక్కోమని క్యాడర్‌కు లైసెన్స్ ఇచ్చాడు. పవన్, చంద్రబాబును జనసైనికులు నమ్మొద్దు' అంటూ విమర్శించారు.