జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా 30 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులో పన్నుల కేటాయింపులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa