ఏపీలోని కేబుల్ ఆపరేటర్లకు రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ కీలక సూచన చేసింది. APSFL ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో BBNL OLTను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపింది.
కేబుల్ ఆపరేటర్లు LMO కోడ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని 3 నెలలపాటు వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ అందించాలని చెప్పింది. ఏప్రిల్ 10 నుంచి BBNL OLTలలో ట్రిపుల్ ప్లే సర్వీస్లు కూడా అందుతాయని, వివరాల కోసం 18005995555 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని కోరింది.