UIDAI దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డును జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? ఎవరు జారీ చేస్తారనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. దేశంలోని ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ప్రత్యేక కార్డు జారీ చేయబడుతుంది.
నీలం రంగులో ఉన్నందున దీనిని బ్లూ ఆధార్ కార్డ్ అంటారు. ఇది సాధారణ ఆధార్ కార్డుకు భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా, పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం ఉండదని UIDAI తెలిపింది.