కవల పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటిది ఏకంగా 25 మంది కవల జంటలు.. ఒకే పాఠశాలలో చదవడం యాదృచ్ఛికమే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో ఇంత మంది కవల పిల్లలు చదువుతున్నారు.
ఈ స్కూల్లో అంతర్జాతీయ కవల పిల్లల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపించారు. కవలలకు పాఠశాల యాజమాన్యం పూలు, పండ్లు, చాక్లెట్లు పంచి అభినందనలు తెలిపారు.