పుల్లరి ఉద్యమ నేత కన్నెగంటి హనుమంతు వర్ధంతి సందర్భంగా మాచర్ల నియోజకవర్గం కాపు సమైక్య సంఘం, వైసీపీ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలోని కన్నెగంటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పుల్లరి ఉద్యమం ద్వారా బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వ్యక్తి కన్నెగంటి అని కొనియాడారు. పల్నాడు జిల్లాను కన్నెగంటి హనుమంతు జిల్లాగా నామకరణం చేయాలని కోరారు.