చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. యువ ఓటర్లంతా తమ భవిష్యత్ కు పాటుపడే నాయకుడికే ఓటు వేయాలని సూచించారు. గురువారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విద్యార్థులతో ఓ క్యాంపెయిన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ వారందరితో ముఖాముఖి మాట్లాడారు. ఏ ఎన్నికలో అయినా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు కీలకమన్నారు.