ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడికి చంద్రబాబు, లోకేష్ ఎబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజిరావు, టివి–5 సాంబ బాధ్యత వహించాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలో ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తమ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ చంద్రబాబు, పచ్చమీడియా ప్రచారం చేయడాన్ని ఖండించారు. వైయస్ఆర్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులు. చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లు. ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు కూతలు కూసినా, ఎల్లోమీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఎంత దుర్మార్గంగా బురద జల్లినా, నీతిమంతులపై అవినీతి కథనాలు రాస్తూ దొంగలను వెనకేసుకొస్తున్నా కూడా ఓర్పుగానే ఉంటున్నారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైయస్ఆర్‌సీపీ బ్యాన్ చేసింది. తమ పార్టీ ప్రెస్‌మీట్‌లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టం చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 10 లక్షల మంది వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారు. ఆయనను ఎవరు పంపించారని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు.