విశాఖ ఉత్తర నియోజకవర్గం 43వ వార్డు వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలో 57 లక్షల 70వేలరూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సామాజిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జీవీఎంసీ వార్డు కార్పొరేటర్ పి ఉషాశ్రీ ఆధ్వర్యంలో గురువారం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నార్త్ కన్వీనర్ కెకెరాజు పాల్గొని ప్రారంభించారు. సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలులో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారని అన్నారు.