బాబు రాజకీయాలకు పనికిరాడని ఇప్పుడు తెలిసిందా.. అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (మహిళాశిశు సంక్షేమం) నారమల్లి పద్మజ భువనేశ్వరిని ప్రశ్నించారు.ఈరోజు నారా భువనేశ్వరి కూడా ఇదే విషయాన్ని మరోమారు ధృవీకరించింది. మా ఆయన చంద్రబాబు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసి పోయాడని.. మీడియా ముందుకొచ్చి ఆమె మాట్లాడిన సందర్భాన్ని చూశాం. ఇది నిజమే.. అన్నారు.