వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ జనసేన పార్టీ గురువారం నిర్వహించిన ‘సమన్వయ కమిటీ సమావేశం’లో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. పొత్తును స్వాగతించిన టీడీపీ - జనసేన కేడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం.. మీడియాపై దాడులను తప్పుపడుతూ రెండవ తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వివరాలను వెల్లడించారు. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉమ్మడి సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.