తిరుమల శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు చెప్పారన్నారు. ఆలయంలో 10 ఏళ్ల క్రితం అభివృద్ధి పనులు చేశారని.. ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. భక్తులు ఎవరు అవాస్తవాలను నమొద్దని కోరారు. ఆలయానికి రాకుండానే రమణ దీక్షితులు, ఆయన కొడుకు జీతం తీసుకుంటున్నారన్నారు. వీడియోలో ఉన్నది రమణదీక్షితులే అని.. ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు. హిందువుని రమణ దీక్షితులు అన్యమతస్థుడుగా చిత్రీకరించడం బాధాకరమని వేణుగోపాల దీక్షితులు వ్యాఖ్యలు చేశారు.