తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరగనుంది. ఈ సంవత్సరం, PDM ధరలు రూ. 4,263గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి చక్కెర మిల్లులు, ఎరువుల కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎరువుల శాఖకు సంబంధించి 'పోషకాల ఆధారిత సబ్సిడీ పథకం' కింద తయారీదారులు టన్నుకు రూ.345 సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందువల్ల తుది వినియోగదారులైన రైతులకు ఎరువుల కంపెనీలు, యూనిట్లు ఈ సబ్సిడీని అందజేస్తే రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందుతాయి.