లోక్సభ ఎన్నికలకు ముందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు గరిష్ట వ్యయం రూ.95 లక్షలకు పెంచింది.
లోక్సభ నియోజకవర్గంలో ప్రచార వాహనాలు 14 వరకు ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. నామినేషన్ దాఖలుకు SC/ST అభ్యర్థులు రూ.12,500లు, ఇతరులు రూ.25 వేలు డిపాజిట్ చెల్లించాలని తెలిపింది. రాజకీయ పార్టీల మేనిఫెస్టోను ప్రకటించిన 3 రోజుల్లో ECకి అందించాలని ఆదేశించింది.