ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోట్లు ఖర్చు చేయకపోతే జనం ఓట్లు వేయరనే కఠోర వాస్తవాన్ని జనసేన ఎట్టకేలకు గుర్తించింది.
వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆర్థికంగా కాస్త పటిష్టంగా ఉన్న వారికే సీట్లు ఇచ్చేందుకు జనసేన మొగ్గు చూపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న నేతలు అందుకు సరిపడా నగదు సిద్ధం చేసుకోవాలని జనసేన అధిష్టానం పేర్కొంది.