కంబదూరు మండలం ములకనూరు గ్రామ శివారులలో కొండపై వెలసిన తిమ్మప్ప స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.