ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో పెండింగ్ ఉన్న నీటి బిల్లులు మంజూరు చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. బిల్లులు విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.