రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో మండలం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పి కే యం ఉడా చైర్మన్ బాల చంద్ర రెడ్డి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని అల్జనేరు వేణుగోపాలస్వామి గుడికి రూ 50 వేలు, జే కొత్తూరు ఆలయానికి రూ 50 వేలు, వేలం దొడ్డిలోని అంబేద్కర్ విగ్రహానికి గ్రిల్ కోసం రూ 40 వేలు ఆయా గ్రామాలలో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.