ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల అవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉంది. దక్షిణ తెలంగాణ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవరన్తం సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. ఒక ద్రోణి దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటున్నారు.
ఏపీలో రెండు రోజుల పాటు అక్కడకక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శని, ఆదివారాల్లో పలు చోట్లు వానలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయంటున్నారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో మంచు ప్రభావం కొనసాగుతోంది. అలాగే పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో కూడా రెండు రోజుల పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.