ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో దారుణం జరిగింది. బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకాశ్ అనే యువకుడు తన అమ్మమ్మ రాణి పఠారియా పేరిట రూ.కోటి బీమా పాలసీ చేయించాడు.
తర్వాత ఓ వ్యక్తికి రూ.30వేలు సుపారీ ఇచ్చి వృద్ధురాలికి పాముకాటు వేయించి చంపించాడు. పాముకాటు కారణంగానే తన అమ్మమ్మ చనిపోయిందని రూ.కోటి బీమా అందుకున్నాడు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో నిజం బయటపెట్టాడు.