ఒడిశాలోని కెందుజార్ జిల్లాలోని బరిగావ్ గ్రామంలో ఇటీవల విషాద ఘటన జరిగింది. సమర ముండా(54) అనే వ్యక్తి శుక్రవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. అతడి సోదరుడు కండే ముండా (57), సోదరుని కుమారుడు లక్ష్మణ్ (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని బంధువులు తెలిపారు.
ఆ వార్త విన్న వెంటనే సమర ముండా బాధతో కుప్పకూలాడు. అతడిని బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.