ప్రజారోగ్య పరిరక్షణ మనందరి బాధ్యత అని అందుకే వైసీపీ ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమండ్రి రూరల్ మండలంలోని 16వ డివిజన్లో మంత్రి పర్యటించారు. మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఓ హోటల్లో అట్లు వేస్తూ మంత్రి అందర్నీ ఆకట్టుకున్నారు.