లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసి ఏడాది అయ్యింది. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘సిసోడియాను అరెస్ట్ చేసి ఏడాది అయ్యింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు లావాదేవీలకు సంబంధించిన ఆదాయాలు సాధించలేకపోయింది. స్కాం జరిగినట్లు నిరూపించలేకపోయింది. కోర్టు దీనిని గమనించాలి. ఇది పూర్తిగా ఫేక్ కేసు’’ అని అన్నారు.