తాడిపత్రి పట్టణంలోని విజయనగరాకాలనీకి చెందిన రామకృష్ణనాయక్ అనే వ్యక్తి ఇంటిలో గత ఏడాది నవంబర్ లో చోరీ చేసి 30 తులాల వెండి, ఒక తులం బంగారం చోరీ చేసిన కేసులో ముద్దాయిలు యాడికి చెందిన జోగిరాజా, అనంతపురంకు చెందిన షేక్ఇబ్రహీంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నేరం రుజువు కావడంతో తాడిపత్రి జడ్జి చంద్రశేఖర్ రెడ్డి వారికి 6 నెలల జైలుశిక్ష విధించినట్లు సిఐ తెలిపారు.