ఈజిప్టు రాజధాని కైరో శివారులో నైలు నదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోవడంతో 19 మంది కూలీలు మరణించారు. గ్రేటర్ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాత్ ఎల్ కాంటేర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పడవ ప్రమాదానికి కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఈజిప్టు పౌండ్లు, క్షతగాత్రులకు 20 వేల పౌండ్ల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.