రైతు భరోసా కేంద్రాల ద్వారా శనగ పంటను అమ్ముకునేందుకు రైతులు సీఎం యాప్ లో మంగళవారం నుండి పేర్లు నమోదు చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర శనగలను కనీసం మద్దతు ధరకు మార్క్ ఫెడ్ ద్వారా సేకరించేందుకు క్వింట రూ. 5, 440 గా నిర్ణయించినట్లుగా వివరించారు. ఈ మేరకు జిల్లాలోని రైతులు తమ పేర్లను నమోదు చేసుకునే సమయంలో పంట నూర్పిడి తేదీని కూడా అందులో పేర్కొనాలన్నారు.