పెద్దకడబూరు గ్రామ శివారుల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిరపను సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. రైతులు పండించిన మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో అరకొర పండిన మిరపను రైతులు కంటికి రెప్పలా కాపాడుకున్నా చివరికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.