ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఆయనే బరిలో దిగడం దాదాపు ఖరారైంది.
రఘురామ పేరుతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తోంది. తాను టీడీపీ, జనసేన, బీజేపీలలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని రఘురామ పలు సందర్భాల్లో చెప్పారు. చివరికి టీడీపీ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.