తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో పట్టణ సీఐ మురళీకృష్ణ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ, స్పెషల్ పార్టీ తో కలిసి అనుమానిత ఇళ్లను తనిఖీలు చేశారు. అనంతరం ప్రజలతో మమేకమై సమస్యలు ఏమైనా ఉంటే పోలీసుల దృష్టి తీసుకురావాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతత జీవనం సాగించాలని కోరారు.