చంద్రబాబుది నోరా.. మూసీనదా? అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని అన్నారు. ఈ రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు శ్రీకాకుళంలో రా.. కదలిరా సభ పెట్టి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానంటున్నాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశాడు?. సీఎం జగన్ ఉత్తరాంధకు పరిపాలన రాజధాని ఇస్తే దాన్ని కోర్టుకు వెళ్లే అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. ఉద్దానాన్ని చంద్రబాబు స్మశానంగా మార్చాడని.. ఉద్దానంలో చావులకు ఆయనే కారణమని ధ్వజమెత్తారు.