తెలుగుదేశం, జనసేన భారీ బహిరంగ సభ బుధవారం సాయంత్రం తాడేపల్లి గూడెం, పత్తిపాడులో జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. తెలుగు జన విజయ కేతనం జెండాగా ఈ సభకు నామకరణం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి ఉమ్మడి అజెండాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. సీఎం జగన్ విమర్శలకు ఈ సభ ద్వారా బదులు ఇవ్వనున్నారు. కాగా ఈ సభకు లక్షలాదిగా తరలివస్తున్న జన సందోహాన్ని దృష్టి లో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కాగా సీట్ల ఖరారు తరువాత జరుగుతున్న జనసేన, టీడీపీ ఉమ్మడి సభపై అందరూ దృష్టి సారించారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఇరు పార్టీల నేతలు ఎలాంటి సందేశం ఇస్తారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.