ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలకు మార్చి 1 నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో నాడు నేడు పనులు జరుగుతున్న నేపథ్యం లో తరగతి గదులు లేక ఆరుబయట కూర్చోవడం వల్ల ఎండతీవ్రతకు విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడం తమ దృష్టికి వచ్చిందని అన్నారు.