జగన్ మోహన్ రెడ్డి ఏదైనా చెబితే చేస్తాడు. చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు. చేయగలిగింది మాత్రమే చెబుతాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెబుతాడు. అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తాడు అన్నది మన కళ్లెదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం. దానికన్నా మందు ఇదే చూశాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెబుతున్నాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. కానీ మళ్లీ జరగబోయేది మాత్రం ఇదేనమ్మా అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవన్నీ చెప్పి ప్రతి ఇంటిని కన్విస్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్.జగన్ దిశానిర్దేశం చేశారు.