అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలం వడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఏఎంసియులో గురువారం ఉదయం జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలసేకరణను జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా ఆమె పంపనూరు తాండాలోని ఏఎంసియూలో జగనన్న పాలవెల్లువ పాలసేకరణను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పాల సేకరణ చేయాలని, ఎక్కడ రాజీ పడకూడదని సూచించారు.