రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు జేటీ రామారావు దరఖాస్తు చేసుకున్నట్లు గురువారం తెలిపారు. విజయవాడ వెళ్లిన ఆయన ఆంధ్రరత్న భవన్లో కార్యాలయం ఇంఛార్జ్ కు దరఖాస్తు అందజేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని కడియం మండలం కడియపులంకకు చెందిన ఈయన ప్రస్తుతం ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.