ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, ముండ్లమూరు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు బుధవారం దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్వయంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.