పంజాగుట్ట డ్రగ్స్ కేసు విచారణను నార్కోటిక్స్ బ్యూరో వేగవంతం చేసింది. టీఎస్ న్యాబ్ విచారణలో స్టాన్లీ కీలక సమాచారం వెల్లడించాడని తెలుస్తోంది.
ఈ మేరకు గోవా కోల్వలే జైలు నుంచే స్టాన్ లీకి ఓక్రా ముఠా డ్రగ్స్ సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో కోర్టు అనుమతితో నార్కోటిక్ బృందం గోవాకి వెళ్లింది. జైలులో ఉన్న ఓక్రాతో పాటు ఫైజల్‌ను విచారించి హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం నార్కోటిక్ బ్యూరో చేస్తోంది. ఇటీవల 8 కోట్ల విలువైన డ్రగ్స్ దొరకిన విషయం తెలిసిందే.