అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ హాజరుకాలేదు. ముందుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో ఆయన విచారణకు రావట్లేదని పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చాయి.
నిన్న ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని ఆయనకు సీబీఐ సమన్లు ఇచ్చింది.