రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్‌ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు. దీంతో ఆయన కారులోనే ఉండిపోయారు. పోలీసుల తీరుపై పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మీడియా పట్ల కూడా పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పాల్ దగ్గరికి మీడియా వారిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ లోపల ఏం జరుగుతుందో తెలియాలన్నారు. ‘‘నన్ను పోలీసులు అడ్డుకున్నారు... దారుణం.. నన్ను ఎందుకు ఆపారు? మీడియాకు కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదు? శారదా పీఠం స్వామిని పిలిచారు... నన్ను ఎందుకు పిలవలేదు.. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? రుషికొండ అక్రమాలు, ప్రారంభోత్సవాలపై కోర్టుకు వెళ్లి పిల్ వేస్తాను’’ అని కేఏపాల్ స్పష్టం చేశారు.