ఇటీవల వైసీపీకి, నరసరావు పేట ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక ప్రకటన చేశారు. మార్చి 2వ తేదీన(శనివారం) టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
శనివారం గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.