అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఇంటికి వస్తే శరీరంలోని పార్టులు తీసేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.